IMPORTANCE OF RAMAYANA

RAMA, SETHA and LAKSHMANA 

The Ramayana is a divine book written by a sage for Valmiki as an epic for us. Ramayana means Ramasya Ayanam  - History of Rama. (Ayanam means history, destination). We also find in the Ramayana all the social, religious, spiritual aspects of the Third Age. That’s why it’s going to be epic. In the same way, the Sri Mahabharata is also an epic ... What is special about us in this epic of Ramayana is that it is about miraculous moral behaviour, blessed with a code of conduct. That is

      Ramadi vat vartitavyam Datu Ravanadi vat napravartitavyam!
                                
HANUMAN, SUGREEVA AND JAMBAVANA 
                                                                                        
   RAVANA, VIBHISHANA, SURPANAKA and KUMBAKARNA

On the whole, it is the message that Valmiki Maharshi gave us in the Ramayana. Ramadi vat vartitavyam means to behave like Rama, his followers (e.g. Sitadevi, Lakshmana, Hanuman, Bharat, ..) .... Ravanadi vat pravartitavyam means not to behave like Ravana, his followers (Indrajith, Kumbhakarna, ..). Even among the brothers, there is a difference in mind and behaviour again ...., Ravana's younger brother Vibhishana and Kumbhakarna are two younger brothers. Vibhishana naturally his nature is good. There are also those in the same family who are inherently contradictory. All the brothers in Ramu's family are tolerant and gentle, but Ravanasu's brothers do not have that nature. There are many such messages.

And he became close to the villagers. He is responsible for their good behaviour. As well as monkeys, pythons, and rats, which have no culture. But Ramu is the best personality who can reform them and make them behave like human beings and plant moral elements and moral seeds in them too. Rama's friendship with Sugriva, his zeal for service to Hanuman, his zeal for Jambavanthu is nowhere to be found. Anyone with divine qualities like this in any way
The Ramayana teach us to behave. According to this, our Ramayana tells us how to behave and how not to behave.




తెలుగులో:-


ఉపోద్ఘాతం


సీత, రాముడు, లక్ష్మణుడు  

రామాయణం అనేది మనకు ఇతిహాసము గాను వేదసారంశము గాను వాల్మీకి మహర్షి రచించిన దివ్యమైన గ్రంధం. రామాయణం అంటే రామస్య అయనం  - రాముని యొక్క చరిత్ర. (అయనం అంటే చరిత్ర,గమ్యం అని అర్ధం). త్రేతాయుగం లో వున్న సామాజిక, ధార్మిక, ఆధ్యాతిమిక , భవభోళిక విశేషాలు అన్ని కూడా మనకు రామాయణం లో కనిపిస్తాయి. అందుకే  దాన్ని ఇతిహాసం అన్నారు. అదే విధముగా శ్రీమహాభారతం కూడా ఇతిహాసమే... ఈ రామాయణ ఇతిహాసము లో మనకు విశేషత ఏంటి  అంటే..అద్భుతమైయినటువంటి ధార్మిక ప్రవర్తన గురించి,ఒక  ప్రవర్తన నియమావలీని అనుగ్రహించారు. అంటే 

రామాది  వత్ వర్తితవ్యం  దతూ రావణాది వత్ నప్రవర్తితవ్యం!


 
హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు 


రావణుడు, కుంభకర్ణుడు, సుర్పణఖా, విభీషణుడు 


మొత్తం మీద రామాయణం లో వాల్మీకి మహర్షి మనకి ఇచ్చిన సందేశం అది.   రామాది వత్ వర్తితవ్యం అంటే రాముడు, అతని అనుచరులు (ఉదాహరణకు.. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు,..)వలె  ప్రవర్తించాలి....రావణాది  వత్ నప్రవర్తితవ్యం  అంటే రావణుడు, అతని అనుచరులు (ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు,..) లాగా ప్రవర్తించకూడదు అని అర్ధం. అన్నదమ్ములలో  కూడా మళ్ళీ బుద్ధి లో, ప్రవర్తన లో తేడా ఉంది....,రావణాసుడి తమ్ముడు విభీషణుడు మరియు కుంభకర్ణుడు ఇద్దరు తమ్ముళ్లే వారిలో విభీషణుడు మంచివాడు సహజంగా అతని స్వభావం మంచింది . ఇలా ఒకే కుటుంబంలో స్వభావ వైరుధ్యం వున్న వాళ్ళు  కూడా వుంటారు. రాముని కుటుంబంలో సహోదరులు అందరు సహ్యామైన సౌమ్యస్వభావం కల వారు కానీ  రావణాసుడి సోదరులలో ఆ స్వభావం లేదు ఇలాంటి సందేశాలు చాల ఉంటాయి. 
అంతే  కాకుండా మానవేతర జీవులకి కూడా మానవులు వాలే సంస్కరించి వాళ్లలో కూడా ఒక నైతిక,ధార్మిక, ప్రవర్తనలు అందింప జేసిన ఘనత శ్రీరామచంద్రుడిది కారణం ఏంటి అంటే అడవులలో  నివసించే వంటి గుహుడు మరియి ఆటవికులకు అయన సన్నిహితుడు అయ్యాడు. వాళ్ళ యొక్క సత్ప్రవర్తనకు ఆయనే కారణం అయ్యాడు. అలాగే కోతులు, కొండముచ్చులు, ఎలుకబంట్లు, వీటికి సంస్కారం లేదు. కానీ వాటిని  సంస్కరించి వాటిని కూడా మానవుల వాలే ప్రవర్తించేలా చేసి వాటిలో కూడా ధార్మిక అంశాలను, ధార్మిక బీజాలను  నాటినటువంటి ఉత్తమ వ్యక్తిత్వమ్ రాముడిది. సుగ్రీవుడు తో రాముడికి వున్న స్నేహం, హనుమంతుడు లో వున్న సేవతత్పరత, ఆ జాంబవంతుడు లో వున్నటువంటి సౌశీల్యం మరి ఎక్కడ  కనిపించదు.  ఇలా దైవీ లక్షణాలు కలిగిన అందరు ఏ విధంగా ప్రవర్తించాలో రామాయణం చెప్తుంది.  దీని బట్టి మనషులు ఏ విధముగా ప్రవర్తించాలో ఏ రకంగా ప్రవర్తించకూడదో మన ఈ రామాయణం చెప్తుంది.





















 

0 comments